సైరా ఫైటింగ్ సీన్ కు రూ.75కోట్లు ఖర్చు పెట్టినం: చిరంజీవి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ రెండున విడుదల కానుంది… ఈ చిత్రం హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషా రాష్ట్రాలలో ప్రజలను అలరించనుంది.  సినిమా ప్రమోషన్ లో చిరంజీవి బిజీగా గడుపుతున్నారు. అయితే సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం 45 కోట్ల రూపాయలతో చిత్రీకరించినట్టు వస్తున్న వార్తలను ఖండించారు చిరు. అయితే 45 కోట్లు కాదని  75 కోట్ల రూపాయలతో ఫైట్ సీన్ ను తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సీన్ ను జార్జియాలోని టిలిసి అనే ఏరియాలో షూట్ చేసామని… అక్కడ 45రోజులపాటు టీం మొత్తం అక్కడే ఉన్నమని చెప్పారు. 15రోజులు రిహార్సల్స్ చేశామని అన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, సుదీప్ విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు లు ముఖ్య పాత్రలు పోషించారు.

Latest Updates