ఫాల్స్ కిట్ వల్లనే కరోనా పాజిటివ్

మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు చిత్ర యూనిట్ మొత్తానికి నవంబర్9 ఆదివారం కరోనా టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్టుల్లో మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. అప్పటినుంచి ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. కాగా.. పాజిటివ్ వచ్చి రెండు మూడు రోజులైనా ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఆయన అనుమానంతో మరోసారి అపోలో ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోగా అక్కడ కరోనా నెగిటివ్‌గా వచ్చింది. దాంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెనెట్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకోగా అక్కడకూడా నెగిటివ్ వచ్చింది. అయితే మొదటిసారి పాజిటివ్ వచ్చిన చోటుకి వెళ్లి మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. దాంతో కరోనా కిట్ లోపం వల్లే ఆయనకు మొదటిసారి పాజిటివ్‌గా వచ్చిందని డాక్టర్లు తేల్చారు. దాంతో తనకు అసలు కరోనానే రాలేదనే విషయం స్పష్టం అయింది. తనకు కరోనా సోకిందని తెలియగానే తనపై దయ, ప్రేమ, అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి చిరంజీవి తన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం గురించి తెలియజేస్తూ చిరంజీవి గురువారం రాత్రి ట్వీట్ చేశారు. అందులో తనకు నెగిటివ్ వచ్చిన రిపోర్టును కూడా జత చేశారు.

For More News..

కరోనా సోకిందని భార్యాభర్తల సూసైడ్

ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీస్

కరోనాకు 4 కోట్ల డోసులు రెడీ

 

Latest Updates