250 కార్లతో మెగాస్టార్ చిరంజీవి భారీ ర్యాలీ

Megastar Chiranjeevi will be touring Tadepalligudem in West Godavari district today

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేడు మెగాస్టార్ చిరంజీవి పర్యటించనున్నారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు అవిష్కరించనున్నారు.

ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవికి..  వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో తాడేపల్లి గూడెంకు చేరుకున్నారు.

ఎస్వీ రంగారావు విగ్రహాం ఆవిష్కరించి ఆ పక్కనే ఏర్పాటు చేసిన సభావేదికపై చిరంజీవి ప్రసంగించనున్నారు.  సుమారు 45 నిముషాలకు పైగా చిరు ప్రసంగం సాగనుంది. 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 లోగా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. 120 మంది పోలీసు సిబ్బందితో పోలీసు బలగాలు మెగాస్టార్ కు  భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంత్, ఈలి నానిలు చిరంజీవికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహవిష్కరణ నుంచి సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లను నేతలు వడ్డి రఘురామ్, అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రవణం స్వామినాయుడు, భోగిరెడ్డి రాము, సోమలంక శేషు, మారిశెట్టి అజయ్, బండి రామస్వామి లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Megastar Chiranjeevi will be touring Tadepalligudem in West Godavari district today