తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. పవన్‌కు చిరూ విషెస్..

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేటితో 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న పవన్‌కు ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు విష్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ బర్త్‌డే సందర్భంగా ఆయన తాజా చిత్రం వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ చేతిలో కర్రను.. మరోచేతిలో క్రిమినల్ లా బుక్‌ను పట్టుకొని కుర్చీపై కాలుపెట్టి నిలుచున్న పవన్ లుక్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మా ఇద్దరి ‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే.. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ వారిద్దరి బంధం గురించి తెలుపుతూ పవన్‌కి విష్ చేశారు.

హీరో మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్, పలువురు హీరోలు, హీరోయిన్‌లు కూడా పవన్‌కి విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు.

అదే విధంగా పవన్ బర్త్ డే సందర్బంగా చిత్తూర్‌లో బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్‌తో పవన్ అభిమానులు ముగ్గురు మరణించటం తన గుండెను కలిచివేసిందని చిరు అన్నారు. వారి కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం’ అని ఆయన అభిమానులకు సూచించారు.

For More News..

ఏడేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్‌లో తొలి భారతీయుడు

నా ప్రతి అడుగులో నాన్న తోడుంది: వైఎస్ జగన్

Latest Updates