మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగిస్తాం: కాన్‌రాడ్‌ సంగ్మా

మే నెల 3వ  తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలన్నారు మేఘాలయా సీఎం  కాన్‌రాడ్‌ సంగ్మా. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇవాళ ఉదయం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంగ్మా.. తర్వాత వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తమ రాష్ట్రంలోని గ్రీన్‌జోన్లు, వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో కొన్ని ఆంక్షలు సడలిస్తామని చెప్పారు సంగ్మా. మేఘాలయాలో ఇప్పటి వరకు 12 మందికి కరోనా సోకగా…అందులో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో రెండు జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు.

Latest Updates