క్వీన్ ఎలిజబెత్–2కు ఏడో మునిమనవడు

లండన్: బ్రిటన్ రాజ కుటుంబంలోకి సోమవారం ఓ కొత్త అతిథి వచ్చాడు.క్వీన్ ఎలిజబెత్–2కు ఏడో మునిమనవడు పుట్టాడు. తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరిన మేఘన్ మార్కెల్ బాబుకు జన్మనిచ్చిందని రాజకుటుంబం ఓప్రకటనలో తెలిపింది. తర్వాత ప్రిన్స్ హ్యారీ దీన్ని ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌ లో ధ్రువీకరించారు. నాన్నగా ప్రమోషన్వచ్చినందుకు థ్రిల్లింగ్ గా ఉందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. బాబుకు ఏంపేరు పెట్టాలనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని హ్యారీ చెప్పారు. హ్యారీ,మార్కెల్ దంపతులకు ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌ లో అభినందనల వెల్లువ కురుస్తోంది.

Latest Updates