భారత్ పై చైనా దాడి చేస్తుంటే అదే దేశంతో చేతులు కలుపుతారా? ముప్తీ, ఫరూఖ్ లపై జోషి ఆగ్రహం

పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ,  నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా పై  కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా సాయంతో ఆర్టికల్ 370 సెక్షన్ ను పునరిద్ధరించాలని డిమాండ్ చేయడంపై మండిపడ్డారు.  ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు భారతదేశంలో ఉండటానికి హక్కు లేదని జోషి వ్యాఖ్యానించారు. చైనా.. భారత్ పై దాడి చేస్తుంటే అదే దేశంతో చేతులు కలిపి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కాగా 14 నెలల నిర్బంధం తరువాత  జమ్మూ కాశ్మీర్ జెండాను ఎగురవేయడానికి అనుమతించకపోతే, తమ పార్టీ భారత త్రివర్ణ పతకాన్ని కూడా ఎగురవేయదని ఆమె అన్నారు. గత ఏడాది ఆగస్టు 5 న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడానికి ముందు, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Latest Updates