మళ్లీ గృహ నిర్బంధంలోకి మెహబూబా ముఫ్తీ

గ‌తేడాది 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు క్రమంలో పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం నుంచి ఇటీవ‌లే రిలీజ్ అయ్యారు. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి ఆమెను గృహ‌నిర్బంధం చేశారు. రెండు రోజుల నుంచి త‌న‌ను హౌజ్ అరెస్టు చేసిన‌ట్లు ఆమె తెలిపారు. పుల్వామాలో పార్టీ నేత వ‌హీద్ పారా కుటుంబాన్ని సంద‌ర్శించ‌డానికి త‌నకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ఆమె అన్నారు. త‌న కూతుర్ని కూడా గృహ నిర్బంధం చేసిన‌ట్లు ముఫ్తీ చెప్పారు. పీడీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ పారాను రెండు రోజుల పాటు ప్ర‌శ్నించిన త‌ర్వాత ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా నుంచి డీడీసీ ఎన్నిక‌ల్లో పారా నామినేష‌న్ వేశారు. వ‌హీద్ పారాను నిరాధార ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేసిన‌ట్లు ముఫ్తీ ఆరోపించారు.

Latest Updates