తాజ్ అందాలపై మెలానియా ట్రంప్ ట్వీట్

రెండు రోజుల క్రితం భారత్ లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయ్యారు. ఇదే విషయాన్ని ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ప్రపంచంలోని  వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దగ్గరగా వీక్షించడం ఉత్కంఠతను కలిగించింది’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ అద్భుతంగా ఉందని కొనియాడుతూ..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలసి తాజ్ ను వీక్షించిన ఓ వీడియో ని షేర్ చేశారు.

తాజ్‌ మహల్‌ ముందు ట్రంప్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేసిన ఆమె..’పోటస్‌ అండ్‌ ఫ్లోటస్‌ ఎట్‌ తాజ్‌ మహల్‌’ అని అని ట్యాగ్‌ లైన్‌ ఇచ్చారు. పోటస్‌ అంటే ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌ కాగా.. ఫ్లోటస్‌ అంటే ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌.

Latest Updates