మానసిక జబ్బుంటే ఉరి రద్దు

Mental illness of death row convicts ground to spare them from gallows: SC

సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం

న్యూఢిల్లీ: ఉరి శిక్ష పడిన ఖైదీలు జైళ్లలో మానసికజబ్బులకు గురైతే వాళ్లకు శిక్ష తగ్గిం చొచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిం ది. అప్పెల్లేట్ కోర్టులు ఖైదీ ఆరోగ్యం గురించి విచారించి క్షమాభిక్ష ప్రసాదించొచ్చని జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని జస్టిస్ శాంతనగౌడర్, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ రెడ్ క్రాస్ జైళ్లలో మగ్గే ఖైదీలకొచ్చే మానసిక జబ్బులపై చేసిన రిపోర్టుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా 1999లోఇద్దరు మైనర్లను పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన ఖైదీకి (ప్రస్తుతం మతిస్థిమితం లేదు)విధించిన ఉరి శిక్షను బెంచ్ తగ్గించింది. అతడి శిక్షను జీవిత ఖైదుకు తగ్గిస్తున్నామని చెప్పిం ది.జైల్లో ప్రభుత్వం అతనికి రెగ్యులర్ గా ట్రీట్ మెంట్ఇప్పిం చాలని ఆదేశించింది. సుప్రీం ఉద్దేశం దుర్వినియోగం కాకుండా అనుభవం ఉన్న డాక్టర్లు , క్రిమినాలజిస్టులు, మానసిక జబ్బుల స్పెషలిస్టులతో చెక్ చేయించాకే ఖైదీ వినతిని విచారణకు తీసుకోవాలని అప్పెల్లేట్ కోర్టులకు సూచించింది. అవసరమైతే విచారణకు ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేయొచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీ చెబుతున్నది నిజం కాదని ఆధారాలు సమర్పించొచ్చని చెప్పింది

 

Latest Updates