బోర్లకు కు మీటర్లు..!

  • ఇష్టానికి నీటిని తోడేస్తే బాదుడే

విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగిస్తేట్యాక్స్ వేసేందుకుకేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా పరిశ్రమలు, నివాస సముదాయాలు, హోటళ్లు, ఆస్పత్రులు, ఆఫీసుల్లో వినియోగిస్తున్న బోర్లకు మీటర్లు పెట్టి.. ఎంత నీటిని తోడుతున్నది లెక్కేయనుంది. పరిమితికి మించి వాడితే ‘వాటర్ కన్సర్వేషన్ఫీజు’ వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకుకేంద్ర జల వనరుల శాఖ ఇప్పటికే ప్రతి పాదనలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల పరిస్థి తిపై కేంద్ర భూగర్భ జల వనరుల బోర్డు (సీజీడబ్ల్యూబీ) సమాచారాన్ని సేకరించింది. ఈ వివరాలతో ‘హైడ్రో నెట్‌వర్క్‌’ ఏర్పాటు చేయాలని.. దాని ఆధారంగానే బోర్ల తవ్వకానికి అనుమతులు, నీటి వినియోగం, నియంత్రణ, ఫీజు వసూలు తదితరాలను పర్యవేక్షించాలని యోచిస్తున్నారు.

ఎడాపెడా బోర్లు తవ్వి వందల మీటర్ల లోతునుంచి కూడా నీటిని తోడేస్తుండడంతో భూగర్భ జలాలు నానాటికి అడుగంటుతున్నాయి. మరోవైపు పర్యా వరణ మార్పులు, అడవులు నరికివేతతో వర్షపాతం తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పక్క దేశాల నుంచి నీటిని దిగుమతిచేసుకోవాల్సి వస్తుందని ఇటీవల ఓ సర్వే హెచ్చరించింది. నీటి సమస్యతో దేశ జీడీపీలో 6 శాతాన్ని మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తుందని నీతి ఆయోగ్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భూగర్భజలాల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగు జోన్లుగా విభజన నీటి లభ్యతను బట్టి వివిధ ప్రాంతాలను సురక్షిత, సంక్లిష్ట, ప్రమాదకర, అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా విభజించారు. దేశవ్యాప్తంగా 4,520 ప్రాంతాలు రక్షిత జోన్‌లో ఉండగా, 681 ప్రాంతాలు సంక్లిష్ట జోన్‌లో, 253 ప్రాంతాలు ప్రమాదకర జోన్‌లో, 1,034 ప్రాంతాలు అత్యంత ప్రమాదకర జోన్‌‌‌‌లో ఉన్నాయి. మన రాష్ట్రం లో 15 జిల్లాలే సురక్షిత జోన్‌‌‌‌లో ఉన్నాయి. 11 జిల్లా ల్లో పరిస్థితి సంక్లిష్టంగా, 4 జిల్లాల్లో ప్రమాదకరంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటి హైదరాబాద్‌ అత్యంత ప్రమాదకర జోన్‌‌‌‌లో ఉంది. రాష్ట్ర భూగర్భ శాఖ లెక్కల ప్రకారం 70 మండలాలు అత్యంత ప్రమాదకర జోన్‌‌‌‌లో ఉన్నాయి. 278 మండలాలు సురక్షిత, 169 మండలాలు సంక్షిష్ట, 67 మండలాలు ప్రమాదకర జోన్‌‌‌‌లో ఉన్నాయి.

ఆయా జోన్లలో నీటి లభ్యత, వినియోగాన్ని బట్టి ఒక్కో రంగానికి ఒక్కోరకంగా చార్జీలు వసూలు చేయాలని  జల వనరుల శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వ్యవసాయ రంగానికి, వన్ ఇంచ్ కంటే తక్కువ సైజ్ పైపుతో నీటిని తోడుకుంటున్న గృహాలకు మినహా యింపు ఇస్తారు. మిగతా గృహాలు, పారిశ్రామిక అవసరాలకు నీటికి చార్జీలు వసూలు చేస్తారు. పారిశ్రా మికరంగానికి లభ్యతను బట్టి ఘనపు మీటరు నీటికి కనీసంగా రూ. 20 చొప్పున వసూలు చేయాలని, పరిమితికి మించితే రూ.100 చొప్పున తీసుకోవాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇళ్లలో వినియోగం కోసం క్యూబిక్ మీటర్ కు రూ.2 చొప్పున వసూలు చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌‌‌‌ నుంచే దీన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలను అధికంగా వాడుతున్న దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంది. దేశంలో సాగవుతున్న పంటల్లో 65 శాతం వీటితోనే పండిస్తున్నారు. గతేడాది ఇండియాలో 253 బిలియన్ క్యూబిక్‌‌‌‌ మీటర్ల నీటిని తోడేశారు. ప్రపంచ నీటి వినియోగంలో ఇది నాలుగో వంతు. ఇందులో 228 బీసీఎంల నీటిని పంటల సాగుకే వినియోగిం చినట్టు కేంద్ర భూగర్భ జలవనరుల బోర్డు అంచనా వేసింది. మిగతా 25 బీసీఎంల నీటిని గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించారు. రాష్ట్రంలో గతేడాది (2016–17) 12,36,709 హెక్టా మీటర్ల నీటిని వినియోగించగా.. ఇందులో 7,09,384 హెక్టా మీటర్ల నీటిని సాగుకే వాడారు. ఈ లెక్కన వ్యవ సాయానికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చి.. పారి శ్రామిక, గృహ సముదాయాలకు వసూలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిపాదనల్లో లోపాలు ఉన్నాయని నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ అభ్యంతరం తెలిపింది. వందా రెండొందలకు నీరమ్మితే, పారిశ్రామిక రంగం విచ్చలవిడిగా నీరు వృథా చేయొచ్చని హెచ్చరించింది. అటవీ, వా తావరణ అధికారులతోపాటు, ఐఐటీ ఢిల్లీ, రూర్కీ, ఐఐఎం అహ్మదాబాద్‌, నీతి ఆయోగ్ సభ్యులుగా నిపుణుల కమిటీ వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తోంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జూన్ నుంచి కన్జర్వేషన్ ఫీజును అమలు చేయడం కుదరకపోవచ్చని అంటున్నారు.

భూగర్భ జల వనరుల వినియోగం, నియంత్రణ కోసం ఉమ్మడి ఏపీలో 2002లో వాల్టా చట్టం రూపొందిం చారు. దాని ప్రకారం ఎవరైనా బోర్‌ వేసుకోవాలంటే స్థానిక ఎమ్మార్వో, భూగర్భ జల వనరులశాఖ అధికా రుల అనుమతి తీసుకోవాలి. బోర్‌ వేయాలనుకున్న ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి ఆ ప్రాంతానికి 250 మీటర దూరం వరకూ మరో బోర్ లేకుంటేనే అనుమతిస్తారు. ఉల్లంఘిస్తే బోర్‌వెల్‌‌‌‌ మిషన్‌‌‌‌తో పాటు, బోర్‌నూ సీజ్‌ చేయొచ్చని చట్టం చెబుతోంది. 2014 నాటికి రాష్ట్రంలో 14.5 లక్షలు బోర్లుండగా.. 2018 నాటికి 27 లక్షలకు చేరింది.

Latest Updates