మెట్రో రైలు .. రేపే రీస్టార్ట్

 ఫస్ట్​ రైడ్ ఎల్​బీనగర్​ టు మియాపూర్

9 నుంచి అన్ని కారిడార్లలో అందుబాటులోకి..

ఒక్క కోచ్​లో 100 మంది మాత్రమే

ప్రతి స్టేషన్​లో ఐసోలేషన్ రూమ్

మాస్క్, ఫిజికల్​ డిస్టెన్స్​ మస్ట్​

ఆన్​లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్​తో పేమెంట్స్

మెట్రో టైమింగ్స్ ఉదయం​ 7 నుంచి మధ్యాహ్నం 12 గంటలు

సాయంత్రం ​4 నుంచి రాత్రి  9 గంటలు

హైదరాబాద్ లో మెట్రో ట్రైన్స్ రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. కరోనా రూల్స్ ప్రకారం టెంపరేచర్ చెక్ చేశాకే ట్రైన్ ఎక్కనిస్తారు.

హైదరాబాద్, వెలుగులాక్​డౌన్​తో బ్రేకులు వేసిన మెట్రో రైలు ​రేపటి నుంచి పట్టాలపై పరుగులు తీయనుంది. 7న ఎల్​బీనగర్ నుంచి మియాపూర్​కి ఫస్ట్ ​ట్రైన్ స్టార్ట్​కానుంది. 8న నాగోల్ – రాయదుర్గం కారిడార్ లో మెట్రో సర్వీసులు నడవనున్నాయి. 9 నుంచి అన్ని కారిడార్లలో అందుబాటులోకి వస్తాయి. అన్​లాక్​ 4తో తిరిగి అందుబాటులోకి వస్తున్న మెట్రో వివరాలు, తీసుకోబోతున్న జాగ్రత్తలను ఆ సంస్థ ఎండీ ఎంవీఎస్ ​రెడ్డి శనివారం అమీర్​పేట్​ మెట్రో స్టేషన్​లో వివరించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం12, సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి 9గంటల వరకు మెట్రో నడుస్తుందని చెప్పారు. ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుందని, రద్దీని బట్టి టైమింగ్స్ లో మార్పులుంటాయని తెలిపారు. ఫిజికల్​ డిస్టెన్స్​ మెయింటెన్​ చేసేందుకు ఒక్కో ట్రైన్​లో 300 మందికి మాత్రమే పర్మిషన్​ ఉంటుందని, ఒక కోచ్​లో 100 మందినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. లాక్​డౌన్​కి ముందు ఒక్కో ట్రైన్​లో వెయ్యి మందిదాకా జర్నీ చేసేవారు.

ట్రైన్ లో 75% ఫ్రెష్​ ఎయిర్​కి ఏర్పాట్లు

కొద్దిరోజులపాటు డైలీ 10వేల నుంచి 15వేల మంది ప్రయాణికులు జర్నీ చేసే అవకాశముందని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్ రూల్స్​కి అనుగుణంగా అధికారులు ప్రతి స్టేషన్​లో ఐసోలేషన్ రూమ్​లు ఏర్పాటు చేస్తున్నారు. థర్మల్ స్ర్కీనింగ్, శానిటైజర్, ఫిజికల్​ డిస్టెన్సింగ్ కోసం మార్కింగ్ చేశారు. ట్రైన్​లో 75శాతం ఫ్రెష్ ఎయిర్ ఉండేందుకు అక్కడక్కడా టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచనున్నారు. డైలీ స్టేషన్లలో డిస్ ఇన్​ఫెక్టివ్ ​స్ప్రేతోపాటు, రాత్రిళ్లు ​ట్రైన్లను శానిటైజ్​చేయనున్నారు. స్టేషన్లు, ట్రైన్స్​లో శానిటైజర్​ అందుబాటులో ఉంటుంది. ఫేస్ మాస్క్ ఉన్నవారికి మాత్రమే మెట్రోలోకి పర్మిషన్​ ఇస్తారు.  లేని వారు స్టేషన్​లో కొనుక్కునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్యాసింజర్స్​ టికెట్స్ తీసుకునే టైమ్​లో ఆన్​లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్​ని యూజ్ చేయాల్సి ఉంటుంది. టోకెన్ ​సిస్టమ్​ను రద్దు చేశారు. జర్నీ టైమ్​లో మినిమమ్ బ్యాగేజ్ మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.

 

Latest Updates