మెట్రో పరుగులు.. టేక్​కేర్​..స్టే సేఫ్

హైదరాబాద్, వెలుగుమహానగరంలో కరోనా మొదలైన తర్వాత జనం నార్మల్​లైఫ్​కి దూరమైపోయారు. లాక్​డౌన్​ మొదలైన తర్వాత దాదాపు 6 నెలలు ఇంటికే పరిమితమయ్యారు. జాగ్రత్తలు పాటిస్తూ ఎమర్జెన్సీ, ఫుడ్​ ఐటమ్స్​కోసమే బయటకు వచ్చారు. ఆన్ లాక్ 1 మొదలైన తర్వాత ఇంటికే పరిమితమైన జనాలు మెల్లమెల్లగా రోడ్డెక్కారు. తిరిగి సాధారణ లైఫ్ ను మొదలుపెట్టారు. దీంతో వందల్లో ఉన్న పాజిటివ్​కేసులు కాస్తా  వేలల్లోకి చేరుకున్నాయి.  ప్రస్తుతం మనం అన్ లాక్ 4.0లోకి అడుగుపెట్టాం. ఇందులో భాగంగా స్కూళ్లు, బార్లు, సినిమా హాళ్లు మినహా ప్రభుత్వం అన్నింటికీ పర్మిషన్​ఇచ్చింది. ప్రధానమైన మాస్ ట్రాన్స్ పోర్టు నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇలాంటి టైంలో కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన అప్రమత్తతే మనలను కాపాడుతుంది.  మాస్క్​, ఫిజికల్​ డిస్టెన్స్, హ్యాండ్​గ్లౌజెస్​తో కరోనా దరికి చేరే అవకాశాల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

అజాగ్రత్తే కొంప ముంచుతుంది

ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే కేర్​లెస్​గా ఉన్నవారినే వైరస్​అటాక్​చేసింది. ఇమ్యూనిటీ లేకపోవడం, మారిన లైఫ్​స్టైల్, మాస్కులు పెట్టుకోకపోవడం, శానిటేషన్ తోపాటు అజాగ్రత్తగా ఉన్నవారే కరోనా బారిన పడ్డారు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం తప్పదు. ఇప్పటికే కేసులను కంట్రోల్ చేయడం, కంటైన్ మెంట్ ఏరియాల నిర్వహణ, కాంటాక్ట్ ట్రేసింగ్ అంశాలలో బల్దియా చేతులెత్తేసిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో పర్సనల్​ కేర్​ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంతవరకు మాస్కులు తీయకపోవడమే బెటర్. ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా ఇంటి నుంచి బయటకు రాకూడదు.  ఒకవేళ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా టెస్ట్​ చేసుకోవాలి.

 సెల్ప్​కేర్ మస్ట్

అన్ లాక్ 4.0తో ఇప్పుడిప్పుడే సాధారణ లైఫ్ మొదలైన సందర్భంలో సెల్ఫ్​ కేర్ తప్పనిసరి. ఆగస్టు నాటికి కరోనా అదుపులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించినా అది అబద్దం అని తేలిపోయింది. ప్రభుత్వం బాధ్యత లేని ప్రకటన, జనాల అజాగ్రత్త కలిసి వేల సంఖ్యలో కేసులు పెరిగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సర్కారుపై బారం వేయడం వదిలేసి ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే తప్పా ఇప్పుడు రాబోయే ఉపద్రవాన్ని ఆపడం కష్టం.

మెట్రోలో తాకొద్దు

అన్ లాక్ మొదలైన తర్వాత  బస్సులు, రైళ్లు వంటివి మొదలు కాలేదు. పరిమిత సంఖ్యలో వెళ్లే క్యాబ్​లు, ఆటోలు, పర్సనల్​వెహికల్స్​పై మాత్రమే జనాలు ఆధారపడ్డారు. ఆన్ లాక్ 4.0లో భాగంగా స్కూల్స్, బార్లు, సినిమా హాళ్లు మినహా అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.  పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​లో కీలకమైన మెట్రో మొదలవుతోంది. కాబట్టి జనాల ఆక్టివిటీ పెరిగే చాన్స్​ ఉంటుంది. ఇందులో జర్నీ చేసే క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెట్ల దారిలో వెళ్లే క్రమంలో గోడలు, వస్తువులను తాకకూడదు.

50ఏండ్లు దాటినవారు జాగ్రత్త

పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో తిరిగే క్రమంలో 50 ఏండ్ల పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలి. షుగర్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు జన సమూహాలకు దూరంగా ఉండాలి. ఇప్పటివరకు జనాల నిర్లక్ష్యం కారణంగానే కేసులు విపరీతంగా పెరిగాయి. ఆన్ లాక్ టైంలో ఇదే విధంగా వ్యవహరిస్తే కేసుల సంఖ్య మరింత స్పీడ్​గా పెరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ రూల్స్​బ్రేక్​ చేసేవారిలో యూత్​సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వీరు సామాజిక బాధ్యత తీసుకోవాలి.

‑ డాక్టర్ అన్వేష్, ప్రెసిడెంట్, తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్

Latest Updates