మెట్రో కరెంట్ వైర్లపై ఫ్లెక్సీ.. ఆగిన రైలు

metro-train-stopped-for-20-minutes-in-begumpet

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యారడైజ్- బేగంపేట స్టేషన్ల మధ్య టెక్నికల్ సమస్యలతో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. బేగంపేట వైపు వెళ్లాల్సిన సర్వీసును… ప్యారడైజ్ మెట్రో స్టేషన్ లోనే నిలిపివేశారు.

ప్యారడైజ్ – బేగంపేట స్టేషన్ల మధ్య ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లపై ఓ ఫ్లెక్సీ పడిపోవడంతో మెట్రో అధికారులు అలర్టయ్యారు. వెంటనే పవర్ సప్లై ఆపివేసి.. సహాయక చర్యలు తీసుకున్నారు. ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించారు. అడ్డంకులు తొలగిపోవడంతో.. మెట్రో రైలు ను తిరిగి ప్రారంభించారు.

Latest Updates