హెక్టార్ బుకింగ్స్‌ క్లోజ్‌

  • హై డిమాండ్ తో ఆర్డర్లు నిలిపివేత
  • అక్టోబర్ నుంచి  ప్రొడక్షన్ పెంపు

న్యూఢిల్లీ :  ఎంజీ మోటార్ ఇండియా తాను కొత్తగా లాంచ్ చేసిన ఎస్‌‌‌‌యూవీ హెక్టార్ బుకింగ్స్‌‌‌‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి అంటే జూన్ 4 నుంచి 21 వేల యూనిట్లకు పైగా ఆర్డర్లు రావడంతో.. బుకింగ్స్‌‌‌‌ను ఆపివేసింది. అక్టోబర్ నుంచి తాము ఈ కొత్త ఎస్‌‌‌‌యూవీ ప్రొడక్షన్‌‌‌‌ను 3 వేల యూనిట్లకు పెంచుతామని కంపెనీ తెలిపింది. దీనికి పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను వచ్చే కొన్ని నెలల్లో అందుకుంటామని ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది. గుజరాత్‌‌‌‌లోని హలోల్ ప్లాంట్‌‌‌‌లో హెక్టార్‌‌‌‌‌‌‌‌ను తయారు చేస్తుంది. హెక్టార్ కోసం ఎంజీ మోటార్ చేపడుతోన్న ప్రస్తుత ప్రొడక్షన్ నెలకు రెండు వేల యూనిట్లే ఉన్నాయి. కానీ ఆర్డర్లు మాత్రం 21 వేల యూనిట్లకు పైగా నమోదయ్యాయి.  హెక్టార్‌‌‌‌‌‌‌‌ను రూ.12.18 లక్షల నుంచి రూ.16.88 లక్షల రేంజ్‌‌‌‌లో గత నెలలోనే ఎంజీ మోటార్ లాంచ్ చేసింది. ‘ హెక్టార్​కు వచ్చిన అనూహ్యమైన స్పందనను చూశాం. బుకింగ్స్‌‌‌‌ను ఆపివేయడం ప్రస్తుతం ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు సరియైన సమయానికి డెలివరీ చేసేందుకు సాయపడనుంది’ అని ఎండీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్   చెప్పారు.

Latest Updates