భార్యకు విడాకులిచ్చిన క్లార్క్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ మైకేల్‌‌ క్లార్క్‌‌.. తన ఏడేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలకనున్నాడు. తన భార్య కైలీ బోల్డికి విడాకులు ఇస్తున్నట్లు ఇవ్వబోతున్నాడు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోతున్నామని ఇద్దరూ బుధవారం ప్రకటించారు. అయితే ఈ విడాకుల విలువ దాదాపు 40 మిలియన్‌‌ డాలర్లని క్రికెట్‌‌ వర్గాల సమాచారం. గత ఐదు నెలలుగా విడివిడిగా జీవిస్తున్న క్లార్క్‌‌, కెల్లీ.. కూతురు కేస్లీ బాధ్యతను మాత్రం సమానంగా పంచుకోనున్నారు. విడిపోయినా ఒకరిమీద ఒకరికి గౌరవం తగ్గదని స్పష్టం చేశారు. 2012లో పెళ్లి చేసుకున్న క్లార్క్‌‌, కెల్లీకి 2015లో కెస్లీ జన్మించింది. ఆస్ర్టేలియా తరఫున 115 టెస్టులు ఆడిన క్లార్క్..​ 8643 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉన్నాయి. అలాగే 245 వన్డేల్లో 7981 పరుగులు చేశాడు.

Latest Updates