అబ్బబ్బబ్బ ఏం డ్యాన్సు.. జాక్సన్‌‌ను మించి జేసిండుపో

డ్యాన్స్‌‌ అంటే మైకేల్‌‌ జాక్సన్‌‌.. జాక్సన్‌‌ అంటే డ్యాన్స్‌‌. ప్రపంచవ్యాప్తంగా పిచ్చి ఫ్యాన్స్‌‌ ఉన్నారాయనకు. అట్లాంటి  డ్యాన్స్‌‌ కింగ్‌‌ను మైమరిపించాడో యంగ్‌‌ స్టార్‌‌. ఆ చిన్నోడు వేసిన రకరకాల స్టెప్పులు చూసి ‘అబ్బబ్బబ్బ’ అనాల్సిందే. నోరేళ్లబెట్టాల్సిందే. అట్లాంటి ఓ వీడియోను టిక్‌‌టాక్‌‌లో చూసి ఫిదా అయిన ఓ ట్విట్టర్‌‌ యూజర్‌‌ అతని అన్ని వీడియోలను ఒకదగ్గర చేర్చి ‘వాచ్‌‌ టిల్‌‌ ది ఎండ్‌‌’ అని పోస్టు చేశాడు. ఎలాగైనా అతడిని ఫేమస్‌‌ చేయాలని రాసుకొచ్చాడు. హృతిక్‌‌రోషన్‌‌, ప్రభుదేవాను కూడా ట్యాగ్‌‌ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్‌‌ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే లక్షల్లో జనాలు చూశారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ డ్యాన్సును మైకేల్‌‌ జాక్సన్‌‌ చూస్తే సంతోషిస్తాడని ఒకరు, కొత్త మైకేల్‌‌ వచ్చేశాడని ఇంకొకరు, జాక్సన్‌‌ను చూసి ఎంతో మంది ఇన్‌‌స్పైర్‌‌ అవుతున్నారని మరొకరు కామెంట్‌‌ చేశారు. ఆ డ్యాన్సర్‌‌ పేరు యువరాజ్‌‌ సింగ్‌‌. టిక్‌‌టాక్‌‌లో ‘బాబాజాక్సన్‌‌2020’ పేరు మీద వీడియోలు పోస్టు చేస్తున్నాడు. మనోడికి పదకొండు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తన ఫోన్‌‌ను బంగ్లపైన పిట్టగోడకు ఆనించి కిందికి జారకుండా ఓ చిన్న రాయి పెట్టి వీడియోలు చేస్తున్నాడీ సింగ్‌‌.

Latest Updates