తక్కువ ధరలో కొత్తగా మూడు మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు

స్మార్ట్ ఫోన్ మార్కెటింగ్ సంస్థ మైక్రోమ్యాక్స్.. భారత మార్కెట్లో మూడు కొత్త ఫోన్లను విడుదల చేసింది. కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గతేడాది అక్టోబర్ లో ఐవన్ నోట్ ను విడుదల చేసిన తర్వాత మైక్రోమ్యాక్స్ మరో కొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేయలేదు. ఈ క్రమంలో ఒకేసారి మూడు ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు రెడీ ఉంది. అయితే ఈ ఫోన్ల ధరలన్నీ రూ. 10 వేల లోపే ఉంటాయని తెలిపింది. ఇదే సమయంలో చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని పలువురు సూచించారన్న మైక్రోమ్యాక్స్…. తాము ఆపనిలోనే బిజీగా ఉన్నామంటూ సానుకూల సమాధానం ఇచ్చింది.

Latest Updates