సత్య నాదేళ్ల జీతం రూ.305 కోట్లు

వాషింగ్టన్: ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌‌ గత ఆర్థిక సంవత్సరంలో అద్భుత ప్రగతిని సాధించడమేగాక సీఈఓ సత్య నాదేళ్ల జీతాన్ని 66 శాతం పెంచింది. దీంతో ఆయన 2018–19 ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్‌‌ డాలర్ల (దాదాపు రూ.305 కోట్లు) జీతం అందుకున్నారు. బేస్‌‌ శాలరీ 2.3 మిలియన్‌‌ డాలర్లు (దాదాపురూ.16 కోట్లు) కాగా మిగతా మొత్తం అంతా షేర్ల ద్వా రా వస్తుంది. సత్యకు కంపెనీ 29.6 మిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లను ఇచ్చింది.10.7 మిలియన్‌‌ డాలర్లను నాన్‌‌ ఈక్విటీ ఇన్సెంటివ్‌‌ ప్లాన్‌‌ కాంపన్సేషన్‌‌గా చెల్లించింది. ఇతర భత్యాలుగా 1,11,000 డాలర్లు చెల్లించింది.సత్య పటిష్ట నాయకత్వం వల్ల కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసి ఇతర మార్కెట్లకూ విస్తరించగలిగిందని డైరెక్టర్లు ప్రశంసించారు.2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆయన 25.8 మిలియన్‌‌ డాలర్లు (రూ.183 కోట్లు) జీతంగా పొందారు. సత్య 2014లో మైక్రోసాఫ్ట్‌‌లో చేరిన తరువాత క్లౌడ్‌‌ కంప్యూటింగ్‌‌ విభాగంలో కంపెనీ దూసుకెళ్లింది. ఆపిల్‌‌ సీఈఓ టిమ్‌‌ కుక్‌ గత ఆర్థిక సంవత్సరంలో 15.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.112 కోట్లు), గూగుల్‌‌ సీఈఓ సుందర్‌‌ పిచాయ్‌‌ 1.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.13 కోట్లు) జీతం తీసుకున్నారు.

Latest Updates