మెట్రో స్టేషన్లకు ప్రైవేట్‌‌‌‌ షటిల్స్

హైదరాబాద్,  వెలుగు: లాస్ట్ మైల్ కనెక్టివిటీ ద్వారా మెట్రో రైడర్ షిప్ పెంచుకునేందుకు హెచ్ఎంఆర్ చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు హైటెక్ సిటీ సహా వివిధ ప్రాంతాల్లో కంపెనీలతో జరిపిన చర్చలు ఫలితాలు ఇస్తున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి ఆయా సంస్థల ప్రాంగణాలకు సొంత వాహనాల్లో ఉద్యోగులను తరలించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా హైటెక్ సిటీలో ఇప్పటికే 20 సంస్థలు షటిల్ సర్వీసులు నడుపుతున్నాయి. గురువారం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ షటిల్ సర్వీసుల్ని ప్రారంభించింది. ఇలాంటి చర్యలతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.

 

Latest Updates