వీడియో: ముంబై ఇండియన్స్ బౌలర్ ధాటికి రెండు ముక్కలైన మిడ్ వికెట్

ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్తగా వచ్చిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ దెబ్బకి వికెట్ రెండు ముక్కలయింది. ప్రాక్టీస్‌లో భాగంగా.. ట్రెంట్ బౌలింగ్ వేసిన బాల్ నేరుగా వెళ్లి మిడ్ వికెట్‌ను తాకింది. ట్రెంట్ వేగానికి వికెట్ రెండు ముక్కలై ఎగిరిపడింది. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ముంబై ఇండియన్స్ మెయిన్ కోచ్ మహేలా జయవర్ధనే సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ట్రెంట్ బౌలింగ్ స్పీడ్ చూసి.. ముచ్చటపడ్డ ముంబై ఇండియన్స్.. “క్లీన్ బౌల్ట్! ట్రెంట్ వచ్చాడు” అని టైటిల్ పెట్టి.. వీడియోను లింక్ చేశారు.

గత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ట్రెంట్.. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ టీంలో జస్ప్రీత్ బుమ్రా మరియు మిచెల్ మెక్‌క్లెనగన్ వంటి మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. తాజాగా ట్రెంట్ రాకతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంలో మరింత పటిష్టంగా మారిందనే చెప్పుకోవచ్చు.

ముంబై ఇండియన్స్ సెప్టెంబర్ 19న ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీంతో అబుదాబిలో తలపడనుంది. ఇప్పటికే నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌ను గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. అయిదో టైటిల్ నెగ్గాలనే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

For More News..

కేంద్ర మాజీ మంత్రి ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్‌ మృతి

యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ గెలుచుకున్న ఒసాకా

క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

Latest Updates