మధ్యాహ్న భోజన పథకం : పెరిగిన వంట ఖర్చు

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చు ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వంట ఖర్చు ధర పెంచింది. ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో వంట ఖర్చు రూ. 4.13 నుంచి రూ. 4.35కు పెంపు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ. 6.18 నుంచి రూ. 6.51కు పెంపు. 9, 10 తరగతులకు కూడా రూ. 6.18 నుంచి రూ. 6.51కు పెంపు. రూ. 2 గుడ్డు ధరతో కలిపి ఉన్నత పాఠశాలల్లో రూ. 8.51కు పెంచింది. 2018 ఏప్రిల్‌ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమలు వర్తించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

Latest Updates