స్కూళ్లు క్లో జ్ లో ఉంటే.. మిడ్ డే మీల్స్ ఎట్ల అందిస్తరు?

పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు
ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడి కోసం విద్యా సం-స్థలు మూతపడి ఉన్నాయని, మరి స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రభుత్వం ఏవిధంగా అమలు చే-యగలదని హైకోర్టు ప్రశ్నిం చింది. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం కూడా ఇవ్వకుం డా నేరుగా కోర్టుకు వచ్చి పిల్‌ వేస్తే తామేమీ ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆన్ న్ క్లాసుల నిర్వహణ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని, పాలసీ మేటర్స్ కోర్టులు జోక్యం చేసు-కోబోవని తేల్చి చెప్పింది. స్కూళ్లు క్లోజ్ లో ఉండటంతో స్టూ డెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి మిడ్ డే మీల్స్ పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ స్కూల్స్ ఆన్ న్ క్లాస్లు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వా లని కోరుతూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్ వు పిల్‌ వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో సర్కారు కు వినతిపత్రం ఇచ్చేందుకు కొంత టైం కావాలని పిటిషనర్‌ లాయర్‌ దామోదర్ డ్డి కోరారు. దీంతో నాలుగు వారాలు టైం ఇస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయ్ సేన్ రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పిల్ పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం విచారణ జరిపిం ది. విచారణను జులై 27కి వాయిదా వేసింది.

Latest Updates