డబుల్​ బెడ్​రూం ​ఇండ్లలో అర్ధరాత్రి గృహ ప్రవేశాలు! అడ్డుకున్న ప్రజలు

డబుల్​ బెడ్​రూం ​ఇండ్లలో అర్ధరాత్రి గృహ ప్రవేశాలు!

అడ్డుకున్న ప్రజలు

ఖమ్మం రూరల్, వెలుగు: అనర్హులకు ఇండ్లు కేటాయించడమే కాకుండా అర్ధరాత్రి గృహ ప్రవేశాలు చేయిస్తుండడంతో ప్రజలు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో 18 డబుల్​ బెడ్​రూం ఇండ్లు నిర్మించారు. ఈ ఇండ్లకు 30 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 18 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. గురువారం  స్థానిక ఎంపీటీసీ భర్త కొందరితో అర్ధరాత్రి గృహప్రవేశం చేయించేందుకు ప్రయత్నించగా గమనించిన అర్హులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని  వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. అర్హుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని, ప్రభుత్వం నిర్మించిన ఇండ్లలో ఎవరూ గృహప్రవేశం చేయరాదని స్థానిక తహసీల్దార్​ టంకా వేయించారు.  అనర్హులకు ఇండ్లు ఇచ్చేందుకు వేల రూపాయలు చేతులు మారినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

For More News..

పెద్దపులి కోసం డ్రోన్​లతో వేట.. ఎరగా ఆవు

సాగర్ బైపోల్‌తో నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ.. ఆంధ్రా కంపెనీకి కాంట్రాక్ట్

వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

వరస్ట్​ సీఎంలలో కేసీఆర్‌కు 4వ ప్లేస్‌

Latest Updates