హైదరాబాద్ లో అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం

హైదరాబాద్ నగరాన్ని అర్ధరాత్రి వర్షం వణికించింది. నగరం అంతటా భారీ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి… 4 గంటల మధ్య… సిటీలో వర్షం కురిసింది.

ఎల్బీనగర్, కోఠి, సికింద్రాబాద్, కూకట్ పల్లి, అమీర్ పేట్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, టోలీచౌకి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అల్వాల్, ఈసీఐఎల్ సహా… నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం పడింది. భవనాల్లో సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. పొద్దున్నే లేచి మోటర్లు పెట్టి.. నీటిని బయటకు తోడారు సిటీ జనం.

లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి చేరడంతో జనం రాత్రంతా అవస్థలు పడ్డారు. GHMC మాన్ సూన్ బృందాలు అర్థరాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Latest Updates