కూలిన మిగ్ 27.. పైలట్ సురక్షితం

రాజస్థాన్ లోని జోధ్ పూర్ వద్ద మిగ్ 27 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ రోజు ఉదయం 11.45నిమిషాలకు రాజస్థాన్ లోని ఉత్తర్ లాయ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయిన… కొద్ది సేపటికే ఇంజన్ లో లోపం తలెత్తిందని పైలట్ రిపోర్ట్ చేశాడు. దీంతో.. జోధ్ పూర్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఫైటర్ జెట్ కూలిపోయింది. పైలట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

నాలుగు నెలల్లో కూలిన తొమ్మిది యుద్ధ విమానాలు
ఈ సంవత్సరం మొదటినుంచి తొమ్మిది యుద్ధ విమానాలను ఇండియర్ ఎయిర్ ఫోర్స్ కోల్పోయింది.  ఇందులో ఒక జాగర్ ఫైటర్ బాంబర్, రెండు మిగ్27లు, రెండు హాక్ ఫైటర్స్,  ఒక మిరేజ్ 2000, ఒక మిగ్21 లతో పాటు… పుల్వామా ఘటనలో అభినందన్ నడిపిన మిగ్ 21 కూడా ఫిబ్రవరి 27న నేల కూలింది. పుల్వామా దాడి తర్వాత.. ఆరుగురు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న మిగ్17 జమ్ము కశ్మీర్ లోని బుద్గం జిల్లాలో కూలిపోయింది.

https://twitter.com/ANI/status/1112254289219604480/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1112254289219604480&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fmig-aircraft-crash-jodhpur-routine-mission-1490585-2019-03-31

Latest Updates