జాతికి అంకితమిచ్చిన సబ్ మెరైన్ INS

భారత నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ INS వేలాను ముంబైలో జాతికి అంకితమిచ్చారు నేవీ అధికారులు. ముంబైలోని మజగాన్ డాక్ యార్డ్స్ లో ఈ జలాంతర్గామి తయారైంది. ఇదే శ్రేణికి చెందిన మరో రెండు సబ్ మెరైన్లు మజగాన్ డాక్ యార్డ్ లిమిటెడ్ లో తయారవుతున్నాయి. 2005లో ఫ్రాన్స్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం 6 జలాంతర్గాములను తయారు చేయాల్సి ఉంటుంది. భారత నేవీ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 24 సబ్ మెరైన్లను రంగంలోకి దింపాలన్న లక్ష్యం పెట్టుకుంది.

Latest Updates