ఇరాక్ లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న తెలంగాణ వలస కార్మికులు

ఇరాక్ కుర్బిస్తాన్ రాష్ట్రం ఎర్బిల్ నగరంలో కరీంనగర్  కు చెందిన వలస కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భారత కాన్సులేట్ అధికారుల మోసం తో అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుకుంటూ వీ6 తో  తమ గోడు వెళ్లబోసుకున్నారు.  వీసా (గరామా) గడువు ముగియడంతో పాటు ఇరాక్ లో పని చేసుకునే లైసెన్స్(అకామా)గడువు ముగిసిపోయి అక్రమ నివాసులుగా మారడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. పని చేసుకునే లైసెన్స్ గడువు ముగియడంతో కుర్బిస్తాన్ ప్రభుత్వం ఫైన్ విధించిందని వాటి నుంచి  మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మూడు నెలల క్రితమే భారత కాన్సులేట్  కార్యాలయంలో ఓ స్వచ్ఛంధ సంస్థ సహకారంతో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తు అనంతరం తమను ఫైన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో నిన్న రాత్రి ఇరాక్ లోని ఎర్బిల్ నుంచి ఢిల్లీ భయలుదేరేందుకు ప్రయత్నించారు. అయితే భారత కాన్సులేట్ అధికారులు తమని మోసం చేసి ఎయిర్ పోర్ట్ లో తమకు ఇచ్చిన వీసా ఫర్మిషన్ ను అడ్డం పెట్టుకొని  బీహార్, ఉత్తరప్రదేశ్ వాసుల్ని ఇండియాకు తరలించారని అన్నారు.

దీంతో సొంతూరుకు వెళ్తానో లేదోనన్న బెంగతో నిజామాబాద్ జిల్లా రామడుగుకుకు చెందిన పరిమల బోజన్న అనే కూలీ   మృతి చెందాడని, మరో ముగ్గురు కార్మికులు ఆస్పత్రిపాలైనట్లు చెప్పారు. వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు ఇరాక్ నుంచి ఒక్క విమానం కూడా ఏర్పాటు చేయలేదని వీ6తో కరీంనగర్ వలస కార్మికులు  ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates