రష్యాలో మిలటరీ హెలికాప్టర్‌‌ క్రాష్‌

  • నలుగురు మృతి
  • పొలాల్లో కూలిపోయిన హెలికాప్టర్‌‌

మాస్కో: రష్యాలోని ఈస్ట్రన్‌ రీజన్‌ ఆఫ్‌ చుకోట్కాలో మంగళవారం ఉదయం ఎమ్‌ఐ-–8 మిలటరీ హెలికాప్టర్‌‌ క్రాష్‌ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది, ఒక టెక్నీషియన్‌ చనిపోయారు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల అదుపుతప్పి పొలాల్లో కుప్పకూలిపోయిందని డిఫెన్స్‌ మినిస్ట్రీ చెప్పింది. వారం వ్యవధిలో హెలికాప్టర్‌‌ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఈ నెల 19న మాస్కో నుంచి వచ్చిన ఎమ్‌ఐ–8 హెలికాప్టర్‌‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు.

Latest Updates