టెర్రరిస్టుల దాడిలో సిటిజన్‌ మృతి

శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లా, బోమై ప్రాంతంలో శనివారం సాయంత్రం టెర్రరిస్టులు ఓ పౌరుడ్ని కాల్చి చంపారని అధికారులు తెలిపారు. బాధితుడిని ఇష్ఫాక్ అహ్మద్ నజర్‌‌గా గుర్తించామని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టుల దాడిలో తీవ్రమైన బుల్లెట్ గాయాలవడంతో నజర్‌‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ను కొనసాగిస్తున్నామని, మిలిటెంట్స్‌ను పట్టుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫైరింగ్ జరిగిన ఏరియాను చుట్టుముట్టిన పోలీసులు.. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు.

Latest Updates