పాకిస్తాన్ లో లీటరు​ పాలు రూ. 140

మొహర్రం రోజున పాక్​లో ధర ఇది

ఇస్లామాబాద్‌‌‌‌:  మొహర్రం  రోజున పాకిస్తాన్‌‌‌‌లోని ప్రధాన  సిటీల్లో పాల ధరలు విపరీతంగా పెరిగాయి. కరాచీ, సింధు ప్రావిన్స్‌‌‌‌లోని కొన్ని చోట్ల మంగళవారం లీటరు పాలను రూ. 140కి అమ్మారు. లీటర్‌‌‌‌ మిల్క్‌‌‌‌  రేటు పెట్రోల్‌‌‌‌ కన్నా ఎక్కువగా ఉన్నట్టు పాక్‌‌‌‌ మీడియా పేర్కొంది. ఆదివారం పాక్‌‌‌‌లో లీటరు పెట్రోల్‌‌‌‌ రూ. 113, లీటరు డీజిల్‌‌‌‌ రూ. 91 గా ఉంది. మొహర్రం రోజున జరిగే ఊరేగింపులో పాల్గొనేవారి కోసం  సబీల్స్‌‌‌‌ (స్టాల్స్‌‌‌‌) ను ఏర్పాటుచేస్తారు.  ఇక్కడ భక్తులకు  ఫ్రీగా పాలు, పళ్లరసాలు, తాగునీరు ఇస్తారు.  స్టాల్స్‌‌‌‌లో  పెట్టడం కోసం పాలకు డిమాండ్‌‌‌‌  పెరగడంతో  కరాచీలో  మిల్క్‌‌‌‌ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని స్థానికులు చెప్పారు.  మొహర్రం రోజున పాలధరలు ఇంతగా పెరగడం ఎప్పుడూ చూడలేదని మరొకరు కామెంట్‌‌‌‌ చేశారు. ధరల్ని తగ్గించడంలో అధికారులు పూర్తిగా ఫెయిల్‌‌‌‌ అయ్యారని పాక్‌‌‌‌ పత్రికలు వార్తలు రాశాయి.

Latest Updates