ఒక్కసారిగా రూ.2 పెరిగిన లీటరు పాలధర..

పాల ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.2 పెరిగాయి. పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ సహాకార సంఘాలు నిర్వహించే డెయిరీలతో పాటు అన్ని ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.2 పెంచేశాయి. దీంతో వినియోగదారులపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోంది. గత నాలుగు నెలల క్రితం స్టాండర్డ్‌, హోల్‌ మిల్క్‌ పాల ధరలు పెంచిన విజయ డెయిరీ ఈ సారి సాధారణ వినియోగించే టోన్డ్ మిల్క్‌ ధరలు పెంచేసింది. దీంతో ప్రైవేటు కంపెనీలు కూడా పాల ధరలు పెంచేశాయి. పెరిగిన పాల ధరలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని డైరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

వెన్నశాతం తక్కువగా ఉండే టోన్డ్‌ మిల్క్‌ను విజయ డెయిరీ లీటరు ధర రూ. 42 విక్రయిస్తోంది. తాజాగా పెరిగిన ధరతో సోమవారం నుంచి లీటరు రూ.44గా విక్రయిస్తారు. విజయ డెయిరీ స్టాండర్డ్‌ మిల్క్‌, 6శాతం వెన్న ఉన్న హోల్‌ మిల్క్ ధరలు లీటరు యధాతథంగా కొనసాగుతాయి.
ప్రైవేటు డెయిరీలైన హెరిటేజ్‌, జెర్సీ, దొడ్ల, తిరుమల డెయిరీలతో పాటు చిన్న చితక డెయిరీలు కూడా టోన్డ్‌ మిల్క్‌తో పాటు, స్టాండర్డ్‌ మిల్క్‌, హోల్‌ మిల్క్ ధరలు లీటరు ధర రూ.2 పెంచాయి. దీంతో ప్రైవేటు డెయిరీల టోన్డ్‌ మిల్క్‌ ధరలు రూ.46 అయ్యాయి. అముల్‌ మిల్క్‌ ధరలు మాత్రం ఇప్పటి వరకు పెరగలేదు. నేడో రేపో అముల్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

milk prices Increased by Rs.2 per liter .. Implementation from Monday

==============================
విజయ  
టోన్డ్‌ మిల్క్             రూ.42    రూ.44

ప్రైవేటు కంపెనీల
టోన్డ్‌ మిల్క్            రూ.44     రూ.46

అముల్‌
టోన్డ్‌ మిల్క్‌             రూ.44      ——

పాలరకం                 ప్యాకింగ్‌ పరిమాణం       ప్రస్తుత ధర             పెరిగిన ధర

1. డైట్‌మిల్క్‌                    500 మి.లీ         రూ.18.00         రూ.19.00
2. డబుల్‌ టోన్డ్‌మిల్క్‌         200 మి.లీ         రూ. 8.00           రూ.8.50
3. డబుల్‌టోన్డ్‌ మిల్క్‌         300 మి.లీ         రూ.11.00          రూ.12.00
4. ఫామిలీ మిల్క్‌              500 మి.లీ         రూ.20.00           రూ.21.00
5. డబుల్‌టోన్డ్‌ మిల్క్‌        500 మి.లీ           రూ. 19.00         రూ.20.00
6. టీ స్పెషల్‌ మిల్క్‌          500 మి.లీ           రూ.20.00          రూ.21.00
7. టోన్డ్‌ మిల్క్‌                  200 మి.లీ           రూ.8.50          రూ.9.00
8. టోన్డ్‌మిల్క్‌                500 మి.లీ             రూ.21.00          రూ.22.00
9. టోన్డ్‌ మిల్క్‌              1000 మి.లీ           రూ.42.00           రూ.44.00
10. టోన్డ్‌మిల్క్‌               6లీటర్లు              రూ.246.00          రూ.258.00
11. ఆవుపాలు               500 మి.లీ           రూ.21.00           రూ.22.00

Latest Updates