చిరుధాన్యాలతో పెళ్లి విందు!

‘గ్రీన్ వెడ్డింగ్’.. ఇప్పుడో కొత్త ట్రెండ్ ! పర్యావరణానికి హాని చేసే ఉత్పత్తులేవీ వాడకుండా పెళ్లి జరుపుకోవడమే గ్రీన్ వెడ్డింగ్. ఇటీవలి కాలంలో కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లో చాలా జంటలు తమ పెళ్లిని ఇదే పద్ధతిలో జరుపుకొంటున్నాయి. తాజాగా పాండిచ్ చేరిలో ఒక జంట గత నెలలో ఇదే పద్ధతిలో వివాహం చేసుకుంది. పెళ్లంటే ప్లాస్టిక్ గ్లాసు, ప్లేట్లు వంటి ఉత్పత్తులు, హోరెత్తే డీజే సౌండ్, కాగితపు పూలతో చేసిన కృత్రిమ అలంకరణలు, అన్నింటికీ మించి టేస్టీ ఫుడ్.

ఆహారంపై దృష్టి
పెళ్లిలో కచ్చితంగా చాలా మంది చర్చించేది ఫుడ్ గురించే. ఎంత టేస్టీగా ఉంటే అంత గొప్ప. కానీ, ఇది ఆరోగ్యానికి అంత మంచిది మాత్రం కాదు. అందుకే తమ పెళ్లిలో ఫుడ్ చాలా హెల్తీగా, ట్రెడి షనల్ గా ఉండాలని ఆ జంట కోరుకుంది. చిరుధాన్యాలు, సేంద్రియ కూరగాయలతో చేసిన వంటలు చేయించింది. రైస్, రీఫైన్డ్ సాల్ట్, మైదా, చక్కెర వంటివి వాడకుండా ఆహార పదార్థాలు చేయించారు. తక్కువ ఐటమ్స్ తో మెనూ సింపుల్ గా, హెల్తీగా  ఉండేలా చూసుకున్నారు.

ప్లాస్టిక్ బదులు
ఫంక్షన్లంటే ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి. వీళ్లు మాత్రం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయించుకున్నారు. భోజనానికి అరిటాకులను ఏర్పాటు చేశారు. స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసులు, స్పూన్లు వినియోగించారు. వివిధ అవసరాల కోసం వాడేందుకు ఎకోఫ్రెండ్లీ నూలు బ్యాగులను తెప్పించారు.

ఈ –ఇన్విటేషన్
వెడ్డింగ్ కార్డులంటే కాగితంతో తయారు చేయాల్సిందే. అయితే ఈ జంట మాత్రం ఈ ఇన్విటేషన్స్ ద్వారా బంధువుల్ని ఆహ్వానించారు. అలాగే పెళ్లికి బహుమతులు తీసుకురా నక్కర్లేదని, హాజరవ్వడాన్నే బహుమతిగా భావిస్తామని కార్డులో పే ర్కొన్నారు. అయితే అటవీ సంరక్షణ కోసం పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఎంతో కొం త సాయపడాలని సూచించారు. వినూత్నం గా జరిగిన ఈపెళ్లికి వచ్చిన అతిథుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు. ‘ఈ పెళ్లి ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పించాలనుకున్నాం . ప్రతి ఒక్కరు పర్యావరణ హితమైన జీవనాన్ ని గడపాలి. అందుకే కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం” అని ఆ జంట తెలిపింది.

 

Latest Updates