‘డార్క్ వెబ్’‌లో ఫేస్ బుక్ యూజర్ల డేటా

ఫేస్ బుక్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. అయితే ఫేస్ బుక్ యూజర్ల డేటా ‘డార్క్ వెబ్’ లో విక్రయిస్తున్నట్లు తెలిపారు సైబర్ సెక్యురిటీ సంస్థ ‘సోఫోస్’ పరిశోదకుడు  బాబ్  . 267 మిలియన్ యూజర్ల డేటాను ప్రొఫైల్‌తో సహా ‘డార్క్ వెబ్’ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 540డాలర్లకు… భారత కరెన్సీలో 41వేల రూపాయలకు ఈ డెటా అమ్ముడవుతుందని అన్నారు. ఫేస్ బుక్ వినియోగదారుల ఐడీలు, పూర్తి పేర్లు, ఈ మెయిల్స్, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్ షిప్ స్టేటస్‌లతో సహా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అయితే పాస్ వర్డ్ మాత్రం అందుబాటులో లేదని అన్నారు.   గత సంవత్సరం ఫేస్ బుక్ నుంచి యూజర్స్ వివరాలు లీక్ అయినట్లు చెప్పిన బాబ్ …. అప్పటికంటే ఇప్పుడు 42మిలియన్ యూజర్ల వివరాలు కొత్తగా లీకైనట్లు చెప్పారు. దీంతో అంతా కలిసి 309మిలియన్ యూజర్ల వివరాలు ‘డార్క్ వెబ్’ లో లభ్యమవుతున్నాయని ఆయన అన్నారు.

300మిలియన్లకు పైగా డేటా ఎలా లీక్ అయిందని ‘సైబుల్’ అనే సంస్థ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు యూజర్ల డేటాను రక్షించడానికి రెండు రకాలపద్దతులను పాలించాలని సూచించింది. ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని తెలిపింది.

Latest Updates