మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: అసదుద్దీన్ ఓవైసీ

mim-chief-asaduddin-owaisi-demanding-opposition-to-mim-party-in-telangana-assembly

రాష్ట్ర అసెంబ్లీలో MIM కు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరారు ఆపార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.  ప్రస్తుతం అసెంబ్లీలో అధికారపార్టీ తరువాత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు MIM కే ఉన్నారని.. అందుకే తమకు ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే అని ఆయన అన్నారు. ఇందుకు గాను స్పీకర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఇదే విషయాన్ని వివరిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ 12మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్ మేరకు సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు స్పీకర్. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. రాష్ట్ర అసెంబ్లీలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే తప్పనిసరి 10శాతం సీట్లు ఉండాల్సిందే. అంటే 12మంది ఎమ్మెల్యేలు సదరు పార్టీకి ఉంటేనే ప్రతిపక్షహోదా దక్కుతుంది. MIM కు మాత్రం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో.. MIM కు ప్రతిపక్షహోదా దక్కడం సాధ్యం కాదు. ఇదిలాఉంటే… ప్రస్తుతం అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Latest Updates