అసదుద్దీన్ ఓవైసీకి ఎదురుదెబ్బ

కరీంనగర్ పర్యటన రోజే జిల్లా అధ్యక్షుడి రాజీనామా

కరీంనగర్: జిల్లాలో ఎంపీ అసదుద్దీన్ పర్యటిస్తున్న రోజే.. పార్టీకి ఆ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎం.ఐ.ఎం. అధినేత, ఎంపీ అసదుద్దీన్ శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ప్రచారానికి వెళ్లారు. అదే రోజు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహజ్ అహ్మద్.. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ, గౌరవం లోపించాయని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కార్పోరేషన్ టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే.. టికెట్ల పంపిణీ ఎలా జరిగిందో చెబుతాయని వాహజ్ అహ్మద్ అన్నారు.

Latest Updates