అమ్ముకున్నోళ్లు బాగానే ఉన్నరు.. కొనుకున్నోళ్లే కష్టాలు పడుతున్నరు

భూమి పట్టాలు ఆన్‌లైన్‌లోకి ఎక్కించే సమయంలో చాలా అక్రమాలు జరిగాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. నిజంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి చాలా తేడాలున్నాయని ఆయన అన్నారు. ఆలయాలు, దర్గా, వక్ఫ్ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేయోద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

‘వక్ఫ్ భూములపై సర్వేలతోనే సరిపెడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక చాలామంది భూములు పోయాయి. వారిలో ముస్లీంల భూములే ఎక్కువగా ఉన్నాయి. అమ్ముకున్నోళ్లు బాగానే ఉంటారు, కానీ కొనుకున్నోళ్లే కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో చాలా భూములకు లేఔట్లు లేవు. చాలా భూములకు రిజిస్ట్రేషన్లు లేవు. వక్ఫ్, గుడి భూముల్లో అక్రమాలు చేస్తే ప్రాసిక్యూట్ చేయాలి. సిటీలో కొన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలి. గ్రీన్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.

For More News..

నాకు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా రనౌత్

సెమీ ఫైనల్లో ఓడి.. రికార్డును చేజార్చుకున్న సెరెనా విలియమ్స్

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్

Latest Updates