కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయిన మినీ వ్యాన్

చిత్తూరు: వద్దని చెప్పినా వాగు దాటే ప్రయత్నం చేసిన ఓ మినీ వ్యాన్… చివరకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. చిత్తూరు జిల్లా తంబళం పల్లి వద్ద అనేక మంది జనం చూస్తుండగా జరిగిన ఘటన సంచలనం రేపింది.  నివర్ తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంబళ్ల పల్లి నియోజకవర్గం  పరిధిలోని పెద్దమండ్యం వద్ద చెరువు వద్ద వరద ఉధృతంగా  ప్రవహిస్తోంది. చెరువు కట్టపై నుండి అటూ ఇటూ తిరుగుతున్న వాహనాలను గ్రామస్తులు హెచ్చరించారు. వాగు ఉధృతి పెరిగిందని.. తెలియజేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా వరదలా ప్రవాహం పెరుగుతుండడంతో గ్రామస్తులంగా ఊరిబయటకు వచ్చి గొడుగులు పట్టుకుని ప్రవాహాన్ని గమనిస్తున్నారు. వాగు దాటే ప్రయత్నం చేస్తున్న వారిని నిలువరిస్తున్నారు.

అయితే ఒక మినీ వ్యాన్ మాత్రం  చెరువు దాటే ప్రయత్నం చేసి ఆ ప్రవాహం వేగంలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న డ్రైవర్ కూడా కిందకు దూకినా.. అతను కూడా బయటపడలేకపోయాడు. మినీ వ్యాన్ తోపాటు.. ఓ వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం స్థానిక ప్రజలు గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎలాంటి తాళ్లు లేదా.. రబ్బర్ ట్యూబుల వంటివి ఏమీ లేకపోవడంతో గ్రామస్తులు కేకలు వేస్తూ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. 

for more News…

మహిళా ఖైదీల విడులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

డొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం

కరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?

Latest Updates