శిశువు మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బందిపై ఆళ్లనాని సీరియస్

అమరావతి : విజయవాడలోని డోర్నకల్ రోడ్డులో ఉన్న ఫ్యామిలీ హాస్పిటల్  సిబ్బంది నిర్లక్ష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ట్రీట్ మెంట్ అందకపోవడంతో.. పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మంత్రి వెంటనే స్పందించారు. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఘటనపై విచారించి రిపోర్ట్ ఇవ్వాలని కృష్ణా జిల్లా డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సుహాసినిని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ డెలివరీలపై ప్రతి రోజు సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణీ కుటుంబ సభ్యుల నుండి వివరాలు తెలుసుకుని పూర్తి సమాచారాన్ని అందించాలన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో రోగులకు, గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హాస్పిటల్స్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. రోగులకు వైద్యం అందించే విషయంలో హాస్పిటల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి ఆళ్ల నాని.

Latest Updates