టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్

వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ముందా అని టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని.. మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రాజధానిని దోచుకున్నది చాలక.. మళ్ళ్లీ ఇప్పుడు జోలే పట్టి మరీ దోచుకుంటున్నారని.. చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ చంక ఎక్కుతుందో చెప్పాల్సిందిగా ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను కోరారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేనా అని ప్రశ్నించారు. పొత్తు లేనిదే ముద్ద దిగని మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నార అని ఎద్దేవా చేశారు. పొద్దున లేచింది మొదలు.. ఏ పార్టీ అధికారంలో ఉంది.. ఏ పార్టీ చంక ఎక్కుదామా.. ఎవరి కాళ్లు మొక్కుదామా అని ఆలోచించే మీరు కూడా మాట్లాడుతున్నారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Latest Updates