రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా?

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అని గత ప్రభుత్వం ఏమైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం మాదిరే అమరావతిని తాత్కాలిక రాజధాని చేశారన్నారు. రాజధానికి అడ్రస్ అంటూ లేకుండా చేసింది చంద్రబాబేనని విమర్శించారు. పాలన అంటే ఏంటో జగన్ వంద రోజుల్లో చేసి చూపించారని అన్నారు. జగన్ ది తుగ్లక్ పాలన అన్న లోకేష్ పై బొత్స కౌంటర్ వేశారు. తుగ్లక్ పాలన అంటే చంద్రబాబుది అన్న విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి తట్టా బుట్ట సర్దుకుని వచ్చింది చంద్రబాబేనని అన్నారు.

Latest Updates