కరోనా ట్రీట్‌మెంట్‌ కాస్ట్‌లీ కాదు.. ప్రైవేట్‌ హాస్పిటళ్లకు పోకండి

  • టిమ్స్‌ని సందర్శించిన ఈటెల రాజేందర్‌‌
  • నాకేం కాదు అని అనుకోకుండా.. హాస్పిటల్‌కు రావాలని సూచన

గచ్చిబౌలి: కరోనా ట్రీట్‌మెంట్‌ కాస్ట్‌లీ కాదని, పదివేల రూపాయల లోపే ఖర్చు అవుతుందని మంత్రి ఈటెల రాజేందర్‌‌ అన్నారు. రూ. 2లక్షల మేర బిల్లు అయ్యే అవకాశమే లేదని, ప్రైవేట్‌ హాస్పిటళ్లకు పోయి లక్షలు లక్షలు పొయొద్దని ప్రజలకు సూచించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని టిమ్స్‌ హాస్పిటల్‌ను సందర్శించిన మంత్రి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అన్ని వార్డులు తిరిగి కరోనా రోగులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పేషంట్ల కోసం గాంధీ హాస్పిటల్‌ డెడికేటెడ్‌గా పనిచేస్తోందని, టిమ్స్‌ను కూడా పూర్తి స్థాయిలో కరోనా హాస్పిటల్‌గా మార్చామని, 1350 బెడ్లు, ఐసీయూలు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. శానిటైజేషన్‌, డాక్టర్లు, నర్సింగ్‌, మందులు అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌ ద్వారా ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారని, కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌‌ దగ్గరకు వెళ్తే 100 శాతం బతుకుతారని మంత్రి చెప్పారు. నాకేం కాదు అని అనుకోకుండా ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్కువ మంది బాధపడుతున్నారని, ఆక్సిజన్ పెట్టిన కూడా కొంత మంది చనిపోతున్నారని చెప్పారు. ఆయాసం ఉన్న వాళ్లు తొందరగా హాస్పిటల్‌కు రావాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కరోనా ట్రీట్మెంట్ కేంద్రాలున్నాయని, హైదరాబాద్‌లో కింగ్ కోటి, చెస్ట్, సరోజిని, టిమ్స్, గాంధీ హాస్పిటల్స్‌ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హాస్పిటల్స్‌లో సరిపోయేన్ని బెడ్స్ ఉన్నాయని, ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని చెప్పారు. టిమ్స్‌లో ట్రీట్‌మెంట్‌ బాగుందని పేషంట్లు అందరూ చెప్పారని మంత్రి అన్నారు. వారం రోజుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వరంగల్, సరోజిని, చెస్ట్ హాస్పిట్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ ఇప్పటికే పెడుతున్నారని చెప్పారు. ఆక్సిజన్ ఇంపార్టెంట్అని … 10 వ తారీఖు లోపు బల్క్ ఆక్సిజన్ అందిస్తామని మంత్రి చెప్పారు.

Latest Updates