మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం..

తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాట్లు పెండింగ్..
26న సీఎంను ఆహ్వానిస్తాం.. 7న వస్తారు
ఆంధ్ర రాష్ట్ర మంత్రులనూ ఇన్వైట్ చేస్తాం: ఎర్రబెల్లి దయాకర్ రావు

మేడారం జాతరకు వచ్చే భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే ఇప్పటికీ తాగునీరు, టాయిలెట్స్ లాంటి ఏర్పాట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా ఫిబ్రవరి ఒకటిలోగా పూర్తిచేస్తామని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… 26న సీఎం కేసీఆర్ ను జాతరకు ఆహ్వానిస్తామని చెప్పారు. ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద కూర్చున్నరోజు.. అనగా 7వ తారీఖున సీఎం జాతరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులను జాతరకు ఆహ్వానిస్తామని తెలిపారు. భక్తులు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకవచ్చారని వాటిని తొందరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

Latest Updates