అందుకే సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చాం

గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  పల్లె ప్రగతి కార్యకమం వల్ల గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి  దయాకర్ రావు అన్నారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ… గంగాదేవి పల్లి(ఆదర్శ గ్రామం) లాగా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందుకోసమే సర్పంచులు చెక్ పవర్ ఇచ్చామని అన్నారు.

ఒకవేళ  సర్పంచులు ఎవరైనా గ్రామ నిధులను పక్క దారి పట్టిస్తే  కలెక్టర్లు వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. పల్లె ప్రగతి ఓ నిరంతర కార్యక్రమమని, ప్రజా ప్రతినిధులు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు.

గ్రామ పంచాయితీ సిబ్బంది వేతనాలు భారీగా పెంచామని చెప్పారు దయాకర్ రావు. గ్రామ పంచాయితీల్లో అందరూ భాగస్వామ్యం అయ్యేందుకు నాలుగు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.  పల్లె ప్రగతిలో ప్రతి గ్రామంలో వారికి అవసరమైన ప్రాధాన్యతలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ట్రాక్టర్లు అందని 420 గ్రామాలకు త్వరలోనే ట్రాక్టర్లు అందిస్తామని చెప్పారు.

Latest Updates