జిల్లా కేంద్రాన్ని మార్చేస్తాం.. నాది మాటంటే మాటే

Minister Errabelli Dayakar Rao talks about Bhupalapalli District Head quarters

 

భూపాలపల్లిలో ఎర్రబెల్లి వ్యాఖ్యలు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : ‘ పార్లమెంట్‌‌ ఎన్నికల్లో భూపాలపల్లిలో టీఆర్‌‌ఎస్‌‌కు మెజారిటీ వస్తేనే జిల్లా కేంద్రం ఇక్కడుంటుంది. లేదంటే పరకాలకు తరలించడం ఖాయం. నాది మాటంటే మాటే’ ..ఇవి భూపాలపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలు. భూపాలపల్లి నుంచి జిల్లాకేం ద్రాన్నితరలిస్తారన్న ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తు-న్నాయి. ఎమ్మెల్యే లు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌‌లు జిల్లాకేం ద్రాన్ని మార్చాలని  ప్రయత్నిస్తున్నారని, వారికి ఎర్రబెల్లి సహకారం ఉందని జరుగుతున్న ప్రచారానికి ఇవ్వాళ మంత్రి చేసిన వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. ‘భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి జిల్లాను తీసుకొచ్చిన సిరికొండ మధుసూదనాచారిని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు.. పార్లమెంట్‌‌‌‌ ఎన్ని కల్లోనైనా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థికి మెజారిటీ ఇవ్వాలి. అలా చేస్తేనే జిల్లా కేంద్రం ఎక్కడికి తరలిపోదు.. యూత్‌‌‌‌ ట్రైనింగ్‌ సెంటర్‌‌‌‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకం-గా నిధులు కేటాయిస్తా. అలా కాకుండా పార్టీకి పనిచే-యకుండా.. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే జిల్లాకేంద్రం ఇక్కడ ఉండదు. పార్టీ కార్యకర్తలు కోరు-కున్నా నేను ఒప్పుకోను. నాది మాటంటే మాటే.’ అనిటీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తల సమావేశంలో దయాకర్‌‌‌‌రావు అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు పరేషానయ్యారు. సమావేశం మొదలుకాగానే మధు-సూదనచారి మాట్లాడుతూ, జిల్లా కేంద్రం తరలింపు-పై కొనసాగుతున్న ఊహాగానాలమీద క్లారిటీ ఇవ్వా-లని మంత్రిని కోరారు. దీంతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest Updates