రాజగోపాల్ రెడ్డిని ఉరికించి ఉరికించి కొడుతారు

అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండోరోజే హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు చెప్పినన్ని కట్టలేదని అన్నారు. వెంటనే కలగజేసుకున్న మంత్రి ఎర్రబెల్లి డబుల్ బెడ్ రూంలు కట్టామని, రైతులకు పంటల కోసం సరిపడా నీళ్లు కూడా ఇచ్చామన్న అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని చేసినా చేయలేదని చెబుతున్న రాజగోపాల్ రెడ్డిని ప్రజలు ఉరికించి కొడతారని ఆయన అన్నారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎర్రబెల్లి తెలంగాణ ద్రోహి అంటూ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇటువంటి ద్రోహులందరిని సీఎం కేసీఆర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

For More News..

నేను చెప్పేది వినే ధైర్యం టీఆర్ఎస్‌కు లేదు

పుల్వామా ఎటాక్: బాంబు తయారీకి కావలసిన వస్తువులు అమెజాన్‌లో కొన్న నిందితులు

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కేటీఆర్ నమస్తే.. హరీశ్ షేక్ హ్యాండ్..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’

Latest Updates