క‌రోనా రోగుల‌కు న‌ర్సులు అన్నం తినిపిస్తున్నారు

హైద‌రాబాద్: క‌రోనా రోగుల‌కు వైద్య సిబ్బంది మాన‌వ‌త్వంతో వైద్యం చేస్తున్నారన్నారు వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. సోమ‌వారం ప‌లు హాస్పిట‌ల్స్ లోని సూప‌రింటెండెంట్ ల‌తో మాట్లాడిడిన ఈట‌ల‌.. క‌రోనా రోగుల‌ను వైద్య సిబ్బంది ప‌ట్టించుకోవ‌డంలేద‌న‌డం అవాస్త‌వం అన్నారు. గాంధీ హాస్పిట‌ల్ లో క‌రోనా రోగుల‌కు న‌ర్సులు భోజ‌నం తినిపిస్తున్నార‌ని తెలిపారు. జిల్లా హాస్పిట‌ల్స్ లో త‌క్కువ ల‌క్ష‌ణాలు ఉన్న వారికి ట్రీట్ మెంట్ అందించాల‌ని ఆయా సూప‌రింటెండెంట్ ల‌కు సూచించారు. ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల్లో పూర్తిస్థాయి ట్రీట్ మెంట్ అందించాల‌ని తెలిపారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.

Latest Updates