కరోనా ఎఫెక్ట్..  ఎయిర్ పోర్ట్ లో మంత్రి ఈటల ఇన్స్పెక్షన్

రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటల రాజెందర్ సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని స్క్రీనింగ్ పరికరాలను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌.. ప్రజలను వణికిస్తుండగంతో.. వైరస్  ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్కానింగ్ చేయాలని అక్కడి అధికారులతో అన్నారు.

“ఎయిర్ పోర్ట్ కు ప్రతి రోజు 550 మంది విదేశాల నుండి వస్తుంటారు కాబట్టి వారిని స్కానింగ్ చెయ్యడం తప్పనిసరి. ఎయిర్ పోర్ట్ లో నాలుగు ప్రధాన ధారులు ఉంటాయి. వాటి దగ్గర డాక్టర్లు, నర్సులు, హెల్పర్లు ఉంటారు. విదేశాల నుండి వచ్చే ప్రతి వ్యక్తిని స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసిన వ్యక్తి అనుమానంగా కనిపిస్తే ప్రత్యేకంగా ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన రూమ్ లోకి తీసుకెళ్ళి,  ‌అతనికి పూర్తిగా మాస్కులు వేసి ప్రత్యేక వాహనంలో ప్రత్యేక ద్వారం నుండి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని” మంత్రి అన్నారు.

గతంలో కేవలం 11,12 దేశాల నుండి వచ్చే ప్రయాణికులను మాత్రమే స్క్రీనింగ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలనుండి వచ్చే ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేస్తున్నామని ఈటల అన్నారు. ఈ రోజు సాయంత్రం పూర్తి స్థాయిలో సమిక్షీంచుకుని మంగళవారం నుండి 24/7 థర్మోల్ స్క్రీనింగ్ చేసే ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. ఒక్క ప్రయాణికుడు కూడా తప్పిపోకుండా అందరినీ స్కానింగ్ చేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

Latest Updates