ఎవరికి ఓటువేస్తే మంత్రి వద్దకు వెళ్లగలరో ప్రజలే తెలుసుకోవాలి

టీఆర్​ఎస్​ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని అన్నారు మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. గెలిచే పార్టీ టీఆర్​ఎస్సేనని, కాంగ్రెస్​, బీజేపీలు గెలవడం కష్టమేనన్నారు. కాబట్టి ఎవరికి ఓటు వేస్తే మంత్రి వద్దకు వెళ్తారో ప్రజలు గమనించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయే పార్టీలకు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు.

టీఆర్​ఎస్​ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, హుజురాబాద్‌, జమ్మికుంటను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందన్నారు. హుజూరాబాద్​లో రూ. 50 కోట్లు, జమ్మికుంటలో రూ. 40 కోట్ల నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది కూడా ఇదే ప్రభుత్వమన్నారు. కారు గుర్తుకు ఓటేసి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు మంత్రి ఈటల.

Latest Updates