‘హాస్పిటల్స్ కు వచ్చి చూసి అప్పుడు మాట్లాడండి’

కరోనాను రాజకీయం చేయొద్దని అన్నారు మంత్రి ఈటల రాజేందర్. కొన్ని పార్టీలు సోష‌ల్ మీడియా లో నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుప‌త్రిలో 25 మందికి రెండే టాయిలెట్స్ ఉన్నాయని, డాక్టర్లకు కిట్స్ ఇవ్వకపోవడం వల్ల కరోనా వచ్చిందని.. ఎవరో  నెట్ లోనెగిటివ్ కామెంట్స్  పెడితే.. కొన్ని ఛానెల్స్ అవే ప్రచారం చేస్తున్నాయ‌ని మండిపడ్డారు. వందలాది మంది ప్రభుత్వాన్ని మంచిగా పొగిడారని, ఐసీఎమ్ఆర్ సూచ‌న‌ల ప్ర‌కార‌మే ఇక్క‌డ అన్నీ ప‌రీక్షలు చేస్తున్నామ‌ని ఈట‌ల తెలిపారు. నెగిటివ్ కామెంట్స్ చేసేవారు హాస్పిటల్స్ కు వచ్చి, చూసి మాట్లాడాల‌న్నారు.

లాక్‌డౌన్ ఎత్తివేసిన‌ తరువాత వస్తున్న కేసులపై వైద్యాధికారుల‌తో కూలంకషంగా చర్చించామ‌న్నారు మంత్రి ఈట‌ల‌. రాబోయే సీజ‌న్ వర్షాకాలం కాబట్టి.. సీజనల్ రోగాల బారిన ప‌డ‌కుండా.. గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలో అవ‌న్నీ చర్చించామని చెప్పారు. డెలివరీ కేసుల‌ను పోస్ట్‌పోన్ చేయలేద‌ని, నెలకు 50 వేల డెలివరీలు చేయాల్సిందేన‌న్నారు. గాంధీ, పేట్లబురుజు, సుల్తాన్ బజార్, నిలోఫర్ ఆసుప‌త్రుల్లో డెలివ‌రీ కేసుల‌ను ట్రీట్ చేస్తున్నామని చెప్పారు మంత్రి.

క‌‌రోనా నుంచి ర‌క్షించుకోవ‌డానికి రాష్ట్రంలో ‌10 లక్షల పైన పీపీఈ కిట్లు ఉన్నాయని.. ఏది కొరత లేదని ఆయ‌న‌ అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా పేషంట్స్ ను క్యూర్ చేశామ‌ని చెప్పారు. 150 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామ‌ని, 50 వెంటిలేటర్ లు కేంద్రం నుంచి వచ్చాయని చెప్పారు. త్వరలో మ‌రో 950 వెంటిలేట‌ర్లు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు.

minister etela rajender serious on negative comments over corona treatment in state

Latest Updates